Share News

Widow Pensions వితంతువుల పింఛన్ల పంపిణీకి ఆదేశాలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:43 PM

Instructions Issued for Distribution of Widow Pensions జిల్లాలో 1,634 మంది వితంతువులకు స్పౌజ్‌ కేటగిరీలో ఈ నెల నుంచి పింఛన్లు అందిం చాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి 427, కురుపాంలో 458, సాలూరులో 302, పాలకొండలో 447 వితంతు పింఛన్లు మంజూరయ్యాయి.

 Widow Pensions వితంతువుల పింఛన్ల పంపిణీకి ఆదేశాలు

గరుగుబిల్లి , జూలై 31(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో 1,634 మంది వితంతువులకు స్పౌజ్‌ కేటగిరీలో ఈ నెల నుంచి పింఛన్లు అందిం చాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి 427, కురుపాంలో 458, సాలూరులో 302, పాలకొండలో 447 వితంతు పింఛన్లు మంజూరయ్యాయి. వారితో పాటు గతంలో మంజూరైన పలు రకాల పింఛన్‌దారులకు నిధులు విడుదలయ్యాయి. నిర్ణీత సమయంలో పింఛన్లు అందిస్తాం. నిబంధనలు పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవు.’ అని డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి తెలిపారు.

సామాజిక పింఛ‌న్ల పంపిణీకి స‌ర్వం సిద్ధం : కలెక్టర్‌

పార్వతీపురం, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను నేడు జిల్లావ్యాప్తంగా పంపిణీ కానున్నట్టు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ సొమ్ము అందిస్తారని పేర్కొన్నారు. మొదటిరోజునే శతశాతం పింఛన్లు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు.మండల ప్రత్యేకాధికారులు ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించి నివేదికను అందించాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కదలలేని స్థితిలో ఉన్నవారికి, కళాకారులు తదితర వారికి కనీస పింఛను రూ.నాలుగు వేలు కాగా గరిష్టంగా రూ.15 వేలు వరకు అందిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 1,40,672 మందికి రూ.60.10 కోట్లును పింఛన్ల రూపంలో అందజేస్తున్నట్లు వివరించారు. ఇందులో కొత్తగా మంజూరైన వితంతు పింఛన్‌దారులు 1,634 మంది వరకు ఉన్నారని చెప్పారు.

Updated Date - Jul 31 , 2025 | 11:43 PM