Share News

Vande Mataram స్ఫూర్తిమంత్రం.. వందేమాతరం

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:40 PM

Inspirational Motto… Vande Mataram స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీ యుల్లో స్ఫూర్తినింపిన గేయం ‘వందేమాతరం’ అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ కాంక్షను రగిల్చిన ‘వందేమాతరం’ గీతానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

 Vande Mataram  స్ఫూర్తిమంత్రం.. వందేమాతరం
మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, నవంబరు7(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీ యుల్లో స్ఫూర్తినింపిన గేయం ‘వందేమాతరం’ అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ కాంక్షను రగిల్చిన ‘వందేమాతరం’ గీతానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్లు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో కలిసి వందేమాతరం గీతాలాపన చేశారు. శక్తివంతమైన గేయాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీకి నివాళి అర్పించారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన గేయాన్ని స్మరిస్తూ ముందుకు సాగాలని, భారతమాతకు సేవలు అందించాలని కలెక్టర్‌ సూచించారు.

భక్తుల భద్రతకు ఏర్పాట్లు

దేవాలయానికి వచ్చే భక్తుల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్తీక సోమవారాల్లో శివాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేవాలయాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని ఏఐ ద్వారా భక్తులను లెక్కించొచ్చని తెలిపారు. వంద మందికి మించి భక్తులు హాజరైతే వలంటీర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు క్యూలో వెళ్లేందుకు బార్‌కోడింగ్‌ అవసరమన్నారు. గర్భగుడి లోపల గేట్లును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రెక్కింగ్‌కు సిద్ధం చేయాలి

జిల్లాలో ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, జలపాతాలు, వ్యూ పాయింట్లను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ట్రెక్కింగ్‌ ఏర్పాట్లపై గిరిజన యువతకు కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ మన్యంలో ట్రెక్కింగ్‌కు దాదాపు 12 ప్రదేశాలు ఉన్నాయి. ముందుగా ఆరు ప్రాంతాలను సిద్ధం చేయాలి. శిక్షణ పొందుతున్న టూరిజం గైడ్లు పర్యాటకుల భద్రత చూసుకోవాలి. ’ అని తెలిపారు. పర్యాటక ప్రాంతాలపై వెబ్‌సైట్‌ రూపొందించాలని డీఎఫ్‌వో ప్రసూనాను ఆదేశించారు. రాత్రివేళల్లో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. క్యాంప్‌ ఫైర్‌ వంటివి నిర్వహించాలని సూచించారు.

Updated Date - Nov 07 , 2025 | 11:40 PM