Inspection విద్యాలయాల్లో 13 అంశాలపై పరిశీలన
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:23 PM
Inspection on 13 Key Aspects in Schools కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించింది. వారు అనారోగ్యానికి గురవకుండా ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు మన్యంలో అన్ని రకాల విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులపై వాస్తవ నివేదిక అందించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు.
కదిలిన విద్యాశాఖ
పార్వతీపురం, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించింది. వారు అనారోగ్యానికి గురవకుండా ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు మన్యంలో అన్ని రకాల విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులపై వాస్తవ నివేదిక అందించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. దీంతో విద్యాశాఖ ఒక్కసారిగా కదిలింది. పాఠశాలలు, కళాశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పారిశుధ్యం, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ట్యాంకుల పరిస్థితి, ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల నిల్వ, వంట గదులు, ఆర్వో ప్లాంట్ల పనితీరు.. ఇలా మొత్తంగా 13 అంశాల పరిశీలనకు రంగంలోకి దిగింది. విద్యార్థులు చేతులు కడుక్కునే ప్రదేశాలు, వంట పాత్రలు, సరకుల నిల్వ గదులు, డ్రైనేజీ వ్యవస్థ, తరగతి గదుల్లో గాలి, వెలుతురు పరిస్థితి, విద్యార్థులు కూర్చొనే సదుపాయాలపై ఆరా తీయాల్సి ఉంది. సమీపంలో నీటి వనరులు పరిశీలించాల్సి ఉంది. ఫొటోలతో సహా పరిశీలన విషయాలు, వాస్తవ పరిస్థితిని నివేదిక రూపంలో అందించాల్సి ఉంది.