Inspection గిరిజన గర్భిణుల వసతిగృహం పరిశీలన
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:05 PM
Inspection of Tribal Pregnant Women’s Hostel సీతంపేట ఐటీడీఏ పరిధిలోని వైటీసీలో నిర్వహిస్తున్న గిరిజన గర్భిణుల వసతిగృహాన్ని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.
సీతంపేట రూరల్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని వైటీసీలో నిర్వహిస్తున్న గిరిజన గర్భిణుల వసతిగృహాన్ని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వారికి రుచికరమైన పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. రక్తహీనతను అధిగమించేందుకు అవసరమైన మందులను అందజేయాలని సూచించారు. ఆదికర్మయోగి కార్యక్రమం, సంక్షేమ పథకాలపై ఈ ప్రాంత గిరిజనులకు సచివాలయ పరిధిలో అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందిని ఆదేశించారు.
సరుకుల సరఫరాకు టెండర్లు
గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, పోస్టుమెట్రిక్, మినీ గురుకులాలకు సరఫరా చేయనున్న నిత్యవసర సరుకులకు సంబంధించి స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జీసీసీ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. మొత్తంగా 42రకాల సరుకుల సరఫరాకు నిర్వహించిన ఈ ప్రక్రియలో 11మంది టెండర్‌దారులు పాల్గొన్నారు. నాణ్యత లోపించకూడదని, నిర్దేశిత సమయానికి సరుకులు అందించాలని ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. ఏపీవో చిన్నబాబు, డీడీ అన్నదొర, డీఎం సంధ్యారాణి, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.