స్పా సెంటర్ల తనిఖీ
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:21 AM
నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల స్పా సెంటర్లను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో వన్‌టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి సిబ్బంది శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విజయనగరం క్రైం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల స్పా సెంటర్లను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో వన్‌టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి సిబ్బంది శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ స్పా సెంటర్లకు సీసీ ఫుటేజీలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రికార్డులను సక్రమంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐలు ప్రసన్నకుమార్, సురేంద్ర నాయుడు, రామ్‌గణేష్ సిబ్బంది పాల్గొన్నారు.