Share News

Medical Camps వారపు సంతల్లో వైద్య శిబిరాల పరిశీలన

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:17 AM

Inspection of Medical Camps in Weekly Markets పాలకొండ మండలంలో నవగాం, సీతంపేట వారపు సంతల్లో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరాలను సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ పరిశీలించారు. వైద్య సేవలపై ఆరా తీశారు.

 Medical Camps   వారపు సంతల్లో వైద్య శిబిరాల పరిశీలన
వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

పాలకొండ/సీతంపేట రూరల్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): పాలకొండ మండలంలో నవగాం, సీతంపేట వారపు సంతల్లో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరాలను సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ పరిశీలించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోగులకు రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించాలని తెలిపారు. మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌గున్యా వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. సంతల్లో వైద్య శిబిరాలకు రోగులు వచ్చేలా ముందుగా, గ్రామ, మండల స్థాయిలో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ శిబిరంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, దోనుబాయి పీహెచ్‌సీ వైద్యాధికారి భానుప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 12:17 AM