సమస్యల పరిష్కారానికి చొరవ
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:10 AM
ప్రధాన సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపించనున్నట్లు కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం మండలంలోని వల్లరిగుడబలో సుపరిపాల నలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.
గరుగుబిల్లి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ప్రధాన సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపించనున్నట్లు కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం మండలంలోని వల్లరిగుడబలో సుపరిపాల నలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్యను సర్పంచ్ రౌతు గోవిందరావునాయుడు జగ దీశ్వరికి వివరించారు. కలుషిత నీరు కారణంగా ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎ.మధుసూదనరావు, పార్టీ ప్రతినిధులు ఎం.పురుషోత్తంనాయుడు, తవిటి నాయుడు, అంబటి రాంబాబు, ముదిలిబాబు విజయవాంకుశం, ద్వారపురెడ్డి సత్యనారాయణ, కె.భరత్‌కుమార్, వి.దివాకర్ పాల్గొన్నారు.