మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట: వీసీ
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:49 PM
జేఎన్‌టీయూ గురజాడ విశ్వ విద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫె సర్ వీవీ సుబ్బారావు చెప్పారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుక లకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
విజయనగరం రూరల్, అక్టోబరు 22 ( ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ గురజాడ విశ్వ విద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫె సర్ వీవీ సుబ్బారావు చెప్పారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుక లకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసు కుంటోందని తెలిపారు. విద్యార్థులు విలువ లతో కూడిన విద్యనభ్యసించడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల పట్ల అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. కార్య క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రాజేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జీజే నాగరాజు, బేసిక్ సైన్సెస్ విభాగాధిపతి సౌభాగ్యలక్ష్మి పాల్గొన్నారు.