Share News

సువర్ణముఖిలోకి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:02 AM

మండలంలోని శంబర సమీపంలోగల వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 500 క్యూసెక్కుల సువర్ణ ముఖినదిలోకి శనివారం అధికారులు విడిచిపెట్టారు.

  సువర్ణముఖిలోకి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
వెంగళరాయసాగరం జలాశయం నుంచి నదిలోకి నీటినివిడిచి పెట్టిన దృశ్యం

మక్కువ రూరల్‌, నవంబరు 15(ఆంధ్ర జ్యోతి): మండలంలోని శంబర సమీపంలోగల వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 500 క్యూసెక్కుల సువర్ణ ముఖినదిలోకి శనివారం అధికారులు విడిచిపెట్టారు.వర్షాలు తగ్గినా ప్రాజెక్టు లోకి ఇన్‌ఫ్లో తగ్గకపోవడంతో జలాశయంలో నీటినిల్వ పెరుగుతోందని, దీంతో జలాశయంలోకి వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోను నదిలోకి విడిచి పెడుతున్నామని ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్‌ విలేకరులకు తెలిపారు.శుక్రవారం 200క్యూ సెక్కుల నీటిని నదిలోకి విడిచిపెట్టగా శనివారం మరో 500 క్యూసెక్కుల నీటిని విడిచి పెట్టామని చెప్పారు.

Updated Date - Nov 16 , 2025 | 12:02 AM