అన్ని నియోజకవర్గాల్లో పరిశ్రమలు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:38 PM
పాలనా వికేంద్రీకరణతోపాటు పెట్టుబడులు వికేంద్రీకరణ జరిగి అన్నినియోజకవర్గాల్లో పరిశ్ర మలు వస్తాయని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
లక్కవరపుకోట, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పాలనా వికేంద్రీకరణతోపాటు పెట్టుబడులు వికేంద్రీకరణ జరిగి అన్నినియోజకవర్గాల్లో పరిశ్ర మలు వస్తాయని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. విశాఖలో ఈనెల 14 నుంచి జరిగిన సీఐఐసదస్సులో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వరదను చూసి జగన్‌కి దిమ్మతిరిగి బొమ్మ కనబడిందని పేర్కొన్నారు. సోమవారం లక్కవరపుకోటలో ఆమె విలేకరులతో మాట్లాడు తూ జగన్‌హయాంలో కనీసం అప్పడాల కంపెనీ కూడా రాష్ట్రానికి లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇమేజ్, మంత్రి లోకేష్ కష్టబడడం వల్ల విశాఖలో జరిగిన పెట్టుబుడల సదస్సులో ప్రపంచ దేశాల నలుమూ లల నుంచి వరదలా పెట్టుబడులు వచ్చాయన్నారు.కార్యక్రమంలో టీడీపీరాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, రమణమూర్తి, వెంకటరమణ, రాముడు పాల్గొన్నారు.