Industrial revolution with Chandrababu's vision చంద్రబాబు విజన్‌తోనే పారిశ్రామిక విప్లవం
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:26 PM
Industrial revolution with Chandrababu's vision చంద్రబాబు విజన్‌తోనే మళ్లీ పారిశ్రామిక విప్లవం మొదలైందని, రాష్ట్రానికి పరిశ్రమలు వరదల్లా వస్తున్నాయని గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
చంద్రబాబు విజన్‌తోనే పారిశ్రామిక విప్లవం
మంత్రి సంధ్యారాణి
బయో గ్యాస్ ప్లాంట్ ద్వారా 500 మందికి ఉపాధి: కలెక్టర్
రాజాం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు విజన్‌తోనే మళ్లీ పారిశ్రామిక విప్లవం మొదలైందని, రాష్ట్రానికి పరిశ్రమలు వరదల్లా వస్తున్నాయని గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. వంగర మండలం అరసాడ గ్రామంలో రూ.102 కోట్లతో పీవీఎస్ గ్రూప్ నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్‌కు మంగళవారం రాజాం తహసీల్దార్ కార్యాలయంలో వర్చువల్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి మంత్రితో పాటు కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, విజయనగరం ఎమ్మెల్యే అదితి, పీఏసీ గ్రూప్ ఎండీ పేడాడ రామ్మోహన్‌రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ కె.బంగార్రాజు తదితరులు హాజరయ్యారు. బయోగ్యాస్ ప్లాంట్ శిలాఫలకాన్ని సీఎం ప్రారంభించాక మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ రూ.102 కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కావడం ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయన్నారు. రోజుకు 20 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కలెక్టర్ కె.రామసుందరరెడ్డి మాట్లాడుతూ వంగర మండలం అరసాడ గ్రామంలో బయోగ్యాస్ ప్లాంట్‌ను 13.82 ఎకరాల్లో నిర్మించనున్నట్టు తెలిపారు. తద్వారా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయనున్నట్లు చెప్పారు. తొలుత వర్చువల్‌గా సీఎం ప్రారంభించాక ఎండీ రామ్మోహన్‌రావు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను బీటెక్‌లో గోల్డ్ మెడల్ సాధించానని, 2017లో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ఎంఓయు జరిగందని గుర్తు చేశారు. ‘మీరు ఇచ్చిన స్ఫూర్తితో’ సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తాను ఏర్పాటు చేసే బయోగ్యాస్ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 5వేల మంది రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్ల అప్పలనాయుడు, బొత్స వాసుదేశరావునాయుడు, నంది సూర్యప్రకాష్‌రావు, గురవాన నారాయణరావు, ఆర్డీవో సత్యవాణి, తహసీల్దార్ ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
--------------