స్పేస్ టెక్నాలజీలో భారత్ సత్తా
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:26 AM
స్పేస్ టెక్నాలజీలో భారత్ సత్తా చాటుతోందని మాజీ మంత్రి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా స్ధానిక రాజా కళాశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికాపై ఆధారపడే పరిస్ధితుల నుంచి మన దేశం గట్టెక్కేస్థితికి చేరుకుందన్నారు.
బొబ్బిలి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): స్పేస్ టెక్నాలజీలో భారత్ సత్తా చాటుతోందని మాజీ మంత్రి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా స్ధానిక రాజా కళాశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికాపై ఆధారపడే పరిస్ధితుల నుంచి మన దేశం గట్టెక్కేస్థితికి చేరుకుందన్నారు. ఇస్రో, షార్ కార్యకలాపాలు దేశానికి మంచి ప్రతిష్టను, కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు. శ్రీహరి ర్యాకెట్ ప్రయోగకేంద్ర సందర్శనకు శాస్త్రవేత్తలు ఆహ్వానించడం మంచి పరిణామమని, దీన్ని విద్యార్థులు సద్దినియోగం చేసుకోవా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వహించిన పలు రకాల పోటీలలో విజేతల కు బహుమతులను పంపిణీ చేశారు. విద్యార్థులు కోలాటం, శాస్ర్తీయ నృత్యాలతో అలరించారు. షార్ మూడో లాంచ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ వీరేంద్ర కుమార్, షార్‌కు చెందిన కార్యక్రమంనిర్వాహక కమిటీ చైర్మన్ టి.హరికృష్ణ, కార్యదర్శి ఇ. ప్రదీప్ నాయుడు, కళాశాల జాయింట్ డైరెక్టరు రావు బదరి, అధ్యాపకులు, షార్ సిబ్బంది, అనేక కళాశాలలు పాల్గొన్నారు.