Fevers జ్వరాలపై మరింత అప్రమత్తం
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:01 AM
Increased Vigilance on Fevers సీతంపేట ఏజెన్సీలో జ్వరాలపై వైద్యసిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం దోనుబాయి పీహెచ్‌సీని సందర్శించారు. అక్కడ ఓపీ, మలేరియా, విషజ్వరాల తీవ్రతపై ఆరా తీశారు.
పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యసేవలందించండి
సీతంపేట రూరల్, జూలై 29(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో జ్వరాలపై వైద్యసిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం దోనుబాయి పీహెచ్‌సీని సందర్శించారు. అక్కడ ఓపీ, మలేరియా, విషజ్వరాల తీవ్రతపై ఆరా తీశారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీ పరిధిలో జ్వరపీడితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు వైద్యాధికారి శివకుమార్‌ను ఆదేశించారు. అనంతరం సీతంపేట ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సీజన్‌లో రోజువారీ ఆసుపత్రికి వచ్చే జ్వరపీడితుల సంఖ్యను సూపరింటెండెండ్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. జ్వరాలతో చికిత్సపొందుతున్న రోగులతో మాట్లాడారు. రక్తనమూనాలు సేకరించే గది, అక్కడి రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, ఎన్‌సీడి ప్రోగ్రాం అధికారి జగన్మోహనరావు, మలేరియా సబ్‌యూనిట్ అధికారి మోహనరావు తదితరులు ఉన్నారు.