Intermediate Admissions ఇంటర్ అడ్మిషన్లు పెంచాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:55 PM
Increase Intermediate Admissions ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలని ఇంటర్మీడియట్ విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) మజ్జి ఆదినారాయణ ఆదేశించారు. బుధవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీఐఈవో వై.నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.
బెలగాం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలని ఇంటర్మీడియట్ విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) మజ్జి ఆదినారాయణ ఆదేశించారు. బుధవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీఐఈవో వై.నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ నెల 11తో మూడో విడత అడ్మిషన్ల షెడ్యూల్ ముగియనుంది. ఈ నేపథ్యంలో అడ్మిషన్ల పెంపుదలపై దృష్టి సారించాలి. వారంతపు పోటీ పరీక్షలను పక్బందీగా నిర్వహించాలి. పరీక్ష పేపర్ల మూల్యాంకనం చేసి మార్కులను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. సిబ్బంది విధిగా ఉదయం, సాయంత్రం తప్పని సరిగా ముఖ ఆధారిత హాజరు వేయాలి.’ అని తెలిపారు. పార్వతీపురం జూని యర్ కళాశాలలో రోజూ సాయంత్రం విద్యా శక్తి కార్యక్రమం ద్వారా చెన్నై ఐఐటీ ప్రొఫెసర్ల ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.