Share News

ఆదాయాన్ని మెరుగుపరచుకోవాలి: డీడీవో

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:02 AM

ఆదాయ నిర్వహణ మెరుగుపరచుకోవాలని విజయనగరం డివిజన్‌ డవలప్‌మెంట్‌ అధికారి రోజారాణి కోరారు. శనివారం మండలంలోని గంట్లాం పంచాయతీలో రికార్డులను పరిశీలించారు.

ఆదాయాన్ని మెరుగుపరచుకోవాలి: డీడీవో
రికార్డులు తనిఖీ చేస్తున్న రోజారాణి

డెంకాడ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆదాయ నిర్వహణ మెరుగుపరచుకోవాలని విజయనగరం డివిజన్‌ డవలప్‌మెంట్‌ అధికారి రోజారాణి కోరారు. శనివారం మండలంలోని గంట్లాం పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డుల్లో అవకతవకలు, ముందస్తు ప్రణాళిక లోపాలు, పారిశుధ్యం, తాగునీరు సక్రమంగా ప్రజలకు అందకపోవడం వంటి లోపాలను గుర్తించారు. ఫంక్షనల్‌ కమిటీలన్నీ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పంచాయతీ పలు అంశాల్లో వెనుకబడి ఉన్నా డిప్యూటీ ఎంపీడీవో రెగ్యులర్‌గా పరిశీలించకపోవడంపై మండిపడ్డారు. ఆమె వెంట డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:02 AM