Income from Vacant Lands ఖాళీ స్థలాల నుంచి ఆదాయం
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:21 PM
Income from Vacant Lands జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలను వేసి ఆ గ్రామాలకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షిం చారు.
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలను వేసి ఆ గ్రామాలకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన చెరువులను ఫిష్ ట్యాంక్‌లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా ప్రజలు, రైతులకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖాళీ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి .. ఆ ప్రాంతంలో అనుకూల పంటలను వేయాలని సూచించారు. ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కలు ఉంటే ఉపాధి హామీ పథకం కింద జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలన్నారు. జిల్లాలో రెండు వేలకు పైగా ఉన్న చెరువులు, కుంటల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆదేశించారు. కనీసం ఆరు అడుగుల లోతులో ఏడాది మొత్తం నీరు నిల్వ ఉండేలా చూడాలన్నారు. ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు అందించాలన్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న భూములను ఆసక్తి ఉన్న ఎస్‌హెచ్‌జీలకు అప్పగించాలని వేలం ద్వారా కేటాయించాలని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, మహిళలు, యువతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ ఏడాది 10 వేల మందిని వ్యాపారవేత్తలుగా మార్చాలని, వారికి శిక్షణ ఇచ్చి రుణాలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్, ఐటీడీఏ ఏపీవో ఎ.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.