Improved Medical Services ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - May 15 , 2025 | 10:59 PM
Improved Medical Services through Health Centers పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో యూపీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు.
పార్వతీపురం రూరల్, మే 15 (ఆంధ్రజ్యోతి): పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో యూపీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి సేవలు, నెలవారీ నివేదికలు , ఓపీ వివరాలు, ల్యాబ్ పరీక్షలు, మందులు, ఈహెచ్‌ఆర్ నమోదుపై చర్చించారు. ఆరోగ్య వివరాలు ఆయుష్మాన్ భారత్ ఐడీతో అనుసంధానమై ఉండాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. రోగుల ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్లే వరకు తగు దిశా నిర్దేశం చేస్తూ సంతృప్తికరమైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మౌలికసదుపాయాల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. గర్భిణుల వివరాలు నమోదు చేసి, నిర్దేశించిన సమయానికి వైద్య తనిఖీలు, టీకాలు, ఐరెన్ మాత్రలు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఐవో నారాయణరావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు , వైద్యాధికారులు పాల్గొన్నారు.
నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం
డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో ఆదేశించారు. వైద్య సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ‘పరిశీలించడం, శుభ్రం చేయడం, మూతలు పెట్టి ఉంచడం’ వల్ల డెంగీకి దూరంగా ఉండొచ్చని పేర్కొన్నారు. జిల్లాలో గత ఏడాది 123 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదైనట్టు తెలిపారు. పార్వతీపురం , పాలకొండ ఆసుపత్రుల్లో ఈ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి.. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని స్పష్టం చేశారు.