Share News

Housing Development గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:26 PM

Importance of Housing Development జిల్లాలో చేపడుతున్న గృహనిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

 Housing Development  గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న గృహనిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో నెలకు కనీసం 500 ఇళ్ల నిర్మాణాలైనా పూర్తి చేయాలని క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సూచించారు. మే నెలలోగా 1600 గృహాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. పీఎం ఆవాసయోజన 2.0 కింద లబ్ధిదారులకు అవసరమైన కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాల మంజూరులో తహసీల్దార్లు నిర్లక్ష్యం వహిస్తే సహింబోమన్నారు. చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకు రావాలని ప్రత్యేకాధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్‌ కలెక్టర్లు అశుతోష్‌ శ్రీవాత్సవ, సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:26 PM