దశలవారీగా సూపర్ సిక్స్ పథకాల అమలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:02 AM
: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం దశలవారీగా అమలుచేస్తోందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం కురుపాంలో సూపర్ సిక్స్ సూపర్ పథకాలు, స్త్రీ శక్తి విజయోత్సవాలు నిర్వహించారు.
కురుపాం/గుమ్మలక్ష్మీపురం,ఆగస్టు30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం దశలవారీగా అమలుచేస్తోందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం కురుపాంలో సూపర్ సిక్స్ సూపర్ పథకాలు, స్త్రీ శక్తి విజయోత్సవాలు నిర్వహించారు. జగదీశ్వరి గుమ్మలక్ష్మీపురం నుంచి కురుపాం వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. అనంతరం టీడీపీ కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా మహిళలతో జగదీశ్వరి ర్యాలీ నిర్వహించారు. స్త్రీ శక్తి , సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. . అనంతరం మహిళలు జగదీశ్వరికి సన్మానించారు.
మహిళలకే మొదటి ప్రాధాన్యత
గరుగుబిల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని అరకు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఉపాధ్యక్షులు, సంతోషపురం సర్పంచ్ అంబటి రాంబాబు తెలిపారు. శనివారం సంతోషపురం పంచాయతీ పరిధిలో స్త్రీశక్తి కా ర్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు యమల శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ ఎ.రామకృష్ణ, ఎం.చందు పాల్గొన్నారు.