పారదర్శకంగా పథకాల అమలు
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:44 PM
అధికారం చేపట్టిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా పథకాలు అమలు చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
గజపతినగరం, జూలై 20(ఆంధ్రజ్యోతి): అధికారం చేపట్టిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా పథకాలు అమలు చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన తుమ్మికాపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి, ఏడాది పాలనపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 2047 విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో రూ.360కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పథకాల అమలులో ఏమైనా లోపాలు ఉంటే తెలియజేయాలని వాటిని సరిది ద్దుకుని మరింత సమర్థవంతంగా పని చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. అలాగే మండలానికి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీదర్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గోవింద, ఆండ్ర ప్రాజెక్టు చైర్మన్ కోడి సతీష్, ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొట్టాంలో సుపరిపాలనలో తొలి అడుగు
శృంగవరపుకోట రూరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కొట్టాం గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎం ఎస్ చైర్మన్ గొంప కృష్ణ, టూరిజం కార్పొరేషన్ బోర్డు డైరక్టర్ ఇందుకూరి సుధారాణి ఆధ్వర్యంలో ఆదివారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. వర్షాన్ని లెక్కచేయకుండా గ్రామంలో పర్యటించి, సంక్షేమ పథకాలపై వివరించారు. టీడీపీ మండల అధ్యక్షుడు జీఎస్ నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, నాయకులు రెడ్డి వెంకన్న పాల్గొన్నారు.