Share News

సీమలవానివలస సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:08 AM

తమ గ్రామ సమస్యలు పరిష్కరించా లని కోరుతూ గరుగుబిల్లి మండలం, శివ్వాం పంచాయతీ సీమలవానివలస గ్రామస్థులు ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని కోరారు.

సీమలవానివలస సమస్యలు పరిష్కరించాలి
ఎమ్మెల్యే జగదీశ్వరికి సమస్యలను వివరిస్తున్న గ్రామస్థులు

  • ఎమ్మెల్యేకి విన్నవించిన గ్రామస్థులు

గుమ్మలక్ష్మీపురం, జూన్‌ 17 (ఆంధ్రజ్యో తి): తమ గ్రామ సమస్యలు పరిష్కరించా లని కోరుతూ గరుగుబిల్లి మండలం, శివ్వాం పంచాయతీ సీమలవానివలస గ్రామస్థులు ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని కోరారు. ఈ మేరకు మంగళవారం గుమ్మలక్ష్మీపురంలోని తన నివాసగృహంలో ఆమెను కలిసి, వినతిపత్రం అందించారు. వర్షాకాలంలో మట్టి రోడ్డు వల్ల ఇబ్బందులు పడుతున్నామని సీసీ రోడ్డు గానీ, బీటీ రోడ్డు గానీ మంజూరు చేయాలని కోరారు. పాఠశాల భవనం శిథిలావస్థలో ఉన్నందున నూతన భవనం మంజూరు చేయాలని, తాగునీటి ఓవర్‌ ట్యాంకు కారిపోతూ ఉన్నందున కొత్త వాటర్‌ ట్యాంకు మంజూరు చేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గ్రామ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 18 , 2025 | 12:08 AM