Share News

పట్టు తప్పితే అంతే!

ABN , Publish Date - May 17 , 2025 | 11:40 PM

If you lose your grip, that's it! శృంగవరపుకోట శివారు రేగపుణ్యగిరి గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నిఇన్ని కావు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఆస్పత్రికి తీసుకువెళ్లడమే పెద్ద పరీక్షగా మారింది.

పట్టు తప్పితే అంతే!
రేగపుణ్యగిరి గ్రామం నుంచి రోగిని డోలీతో కొండ కిందకు దించుతున్న గిరిజనులు

పట్టు తప్పితే అంతే!

ఎస్‌.కోట శివారు రేగపుణ్యగిరి గిరిజనులకు డోలీ కష్టాలు

శృంగవరపుకోట, మే 17(ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట శివారు రేగపుణ్యగిరి గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నిఇన్ని కావు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఆస్పత్రికి తీసుకువెళ్లడమే పెద్ద పరీక్షగా మారింది. రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో డోలీ మోతలు తప్పడం లేదు. గ్రామానికి చెందిన వృద్ధురాలు పంగి లింబయ్యమ్మ జ్వరం బారిన పడి తీవ్ర అస్వస్థకు గురికావడంతో శనివారం బంధువులు నర్సింగరావు, రాజులు డోలీ కట్టారు. కొండపై నుంచి అతి కష్టం మీద కిందకు దించారు. కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఈ గ్రామానికి రోడ్డు వేసేందుకు నిధులు అందించినప్పటికీ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - May 17 , 2025 | 11:40 PM