If we want our town to be better, we have to take the lead. మన ఊరు బాగుండాలంటే.. మనమే ముందడుగు వేయాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:45 PM
If we want our town to be better, we have to take the lead. మన ఊరును మనమే బాగు చేసుకుందాం. అందుకు మనమే ముందడుగు వేద్దాం అని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి సూచించారు. రోజూ ఓ గంట శ్రమించి పరిసరాలను శుభ్రం చేస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు రోగాలను దూరం చేయవచ్చని చెప్పారు. కలెక్టరేట్ ఆవరణలో గురువారం స్వచ్ఛత హై సేవ కార్యక్రమం నిర్వహించారు.
మన ఊరు బాగుండాలంటే..
మనమే ముందడుగు వేయాలి
రోజుకు గంట పాటు సేవ చేయాలి
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): మన ఊరును మనమే బాగు చేసుకుందాం. అందుకు మనమే ముందడుగు వేద్దాం అని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి సూచించారు. రోజూ ఓ గంట శ్రమించి పరిసరాలను శుభ్రం చేస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు రోగాలను దూరం చేయవచ్చని చెప్పారు. కలెక్టరేట్ ఆవరణలో గురువారం స్వచ్ఛత హై సేవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జేసీ సేతు మాధవన్‌తోపాటు జిల్లా స్థాయి అధికారులంతా కలిసి కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను, గడ్డిని తొలగించారు. కలెక్టరు, జేసీలు స్వయంగా చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని చెత్తను ఏరి వాహనంలో వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజుకో గంట కేటాయించడం ద్వారా మన ఊరును మనమే బాగు చేసుకుందామని సూచించారు. స్వచ్ఛత హై సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ నగరంలో కొంతమంది చెత్తను పారిశుధ్య కార్మికులకు ఇవ్వకుండా కాలువుల్లోను, రోడ్డు పక్కనా వేసేస్తున్నారని, ఈ అలవాటును మానుకోవాలని కోరారు. కార్మికులు ఇంటి వద్దకు వచ్చినప్పుడు చెత్తను అందజేయాలని సూచించారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 12 మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎస్.శ్రీనివాసమూర్తి, సీపీవో బాలాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.