Share News

స్పందించకపోతే కాలువ పూడ్చేస్తాం

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:00 AM

మరో 48 గంటల్లో సిద్ధార్థ కాలనీ సమస్య పరిష్కా రం కాకపోతే నిర్మించిన కాలువను పూడ్చేస్తామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ హెచ్చరించారు.

స్పందించకపోతే కాలువ పూడ్చేస్తాం

  • మాజీ ఎంపీ హర్షకుమార్‌

  • దళితుల రిలే దీక్షకు సంఘీభావం

భోగాపురం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మరో 48 గంటల్లో సిద్ధార్థ కాలనీ సమస్య పరిష్కా రం కాకపోతే నిర్మించిన కాలువను పూడ్చేస్తామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ హెచ్చరించారు. మహిళలపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ ముంజేరు పంచాయతీ సిద్ధార్థ కాలనీకి చెందిన దళితులు భోగాపురంలో గత కొన్నిరోజులుగా రిలే దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు ఆయన శనివారం హాజరై, సంఘీభావం తెలిపారు. ముందుగా ముంజేరు సిద్ధార్థ కాలనీకి వెళ్లి, అక్కడ నిర్మించిన కాలువను పరిశీలించారు. అనంతరం రిలే దీక్ష శిబిరం వద్ద ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అసంపూర్ణంగా వదిలేసిన కాలువను పూర్తి చేయాలని, లేకపోతే గతంలో ఏవిధంగా వాడుక, మురుగు నీరు పోయేదో అదే విధంగా పోయే విధంగా చేయాలని.. వీటిలో ఏమి చేయా లో అధికారులు నిర్ణయించుకుని 48 గంటల్లో రాత పూర్వకంగా సమాధానం ఇవ్వాలన్నారు. లేదంటే నిర్మించిన కాలువను పూడ్చేస్తామన్నారు. ఈ కార్యకమ్రంలో మాలల రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు, ఆర్‌పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్‌, రాష్ట్ర, జిల్లా నాయకులు సుమారు 100 మంది పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:00 AM