ఇళ్land will be confiscated ల పూర్తిచేయకపోతే స్థలాలు స్వాధీనం
ABN , Publish Date - May 24 , 2025 | 12:16 AM
If the houses are not completed, the land will be confiscated గృహ నిర్మాణ పథకాల కింద గతంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరై నేటికీ పూర్తి చేయని లబ్ధిదారులంతా వెంటనే ఇళ్లు నిర్మించుకోవాలని, లేకుంటే ఆ స్థలాలను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేకాధికారి వెంకటరమణ స్పష్టంచేశారు. జిల్లాలో గృహ నిర్మాణాల పరిశీలనకు వచ్చిన ఆయన వివిధ మండలాల్లో పర్యటించిన ఆనంతరం జిల్లా హౌసింగ్ కార్యాలయంలో ఆయా శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షించారు.
ఇళ్ల పూర్తిచేయకపోతే స్థలాలు స్వాధీనం
మరొకరికి కేటాయిస్తాం
జూన్ 10లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి
గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేకాధికారి వెంకటరమణ
విజయనగరం కలెక్టరేట్, మే 23(ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణ పథకాల కింద గతంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరై నేటికీ పూర్తి చేయని లబ్ధిదారులంతా వెంటనే ఇళ్లు నిర్మించుకోవాలని, లేకుంటే ఆ స్థలాలను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేకాధికారి వెంకటరమణ స్పష్టంచేశారు. జిల్లాలో గృహ నిర్మాణాల పరిశీలనకు వచ్చిన ఆయన వివిధ మండలాల్లో పర్యటించిన ఆనంతరం జిల్లా హౌసింగ్ కార్యాలయంలో ఆయా శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు సహాయాన్ని వినియోగించుకుని లబ్ధిదారులంతా ఇళ్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకుని కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి కేటాయిస్తామన్నారు. లబ్ధిదారులతో అధికారులు నేరుగా మాట్లాడి వారికి ఇళ్ల నిర్మాణాంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించాలని సూచించారు. జిల్లాలో 11,648 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికి 4,649 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 6,999 నిర్మాణాన్ని జూన్ 10 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ మురళీమోహన్ పాల్గొన్నారు.