అదే నిజమైతే జిందాల్‌పై కేసు వెనక్కి తీసుకుంటాం
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:32 PM
‘అధికారులు ప్రజల కోసం కాకుండా పరిశ్రమల పెద్దల కోసం పనిచేయడం బాధగా ఉంది. జిందాల్ భూము లపై వారు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదు’ అని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు.
ఎస్.కోట రూరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘అధికారులు ప్రజల కోసం కాకుండా పరిశ్రమల పెద్దల కోసం పనిచేయడం బాధగా ఉంది. జిందాల్ భూము లపై వారు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదు’ అని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. శనివారం బొడ్డవర గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిందాల్ కోసం కేటాయించిన భూములు గత 18ఏళ్లుగా ఆ పరిశ్రమ అధీనంలో ఉన్నాయని అధి కారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని, ఈ విషయంపై బహిరంగ విచారణ చేపట్టాలని అన్నారు. అదే నిజం అయితే తాము జిందాల్ పరిశ్రమ మీద వేసిన కేసులను వెనక్కి తీసుకుంటామని అన్నారు. ఈ భూములు గత జూన్ వరకూ రైతుల వద్దే ఉన్నాయన్న విషయం ఈ ప్రాంత వాసులకు తెలుసన్నారు. నిర్వాసితులు 154రోజులుగా దీక్ష చేస్తున్నా అధికారులకు పట్టకపోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులు కూడా రైతుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.