అనుమతులివ్వకుంటే ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తాం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:40 AM
‘మా న్యాయపరమైన హాక్కుల కోసం చేస్తున్న నిరసనకు 48 గంటల్లో అనుమతులు ఇవ్వకపోతే ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ను ఆశ్రయిం చడంతో పాటు పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదు చేస్తామ’ని జిందాల్ నిర్వాసితులు హెచ్చరించారు.
శృంగవరపుకోట రూరల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ‘మా న్యాయపరమైన హాక్కుల కోసం చేస్తున్న నిరసనకు 48 గంటల్లో అనుమతులు ఇవ్వకపోతే ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ను ఆశ్రయిం చడంతో పాటు పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదు చేస్తామ’ని జిందాల్ నిర్వాసితులు హెచ్చరించారు. శుక్రవారం బొడ్డవర గ్రామంలో ఎంపీపీ సోమేశ్వరరావు, ఎస్.కోట సర్పంచ్ గనివాడ సంతోషి కుమారి, గిరిజన, ఎస్సీల పెద్దలు ముత్యాల సన్యాసిరావు, కేత వీరన్నలు మాట్లాడుతూ వారం రోజులుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టెంట్లు తీసేశారని, భోజనాలకు వెళుతుంటే అడ్డుకుంటున్నారని... చివరికి రోడ్డుపైకి వస్తుంటే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రైతులు హక్కుల కోసం పోరాటం చేస్తుంటే కొంతమంది అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని.. వారికి తమ బాధలు ఏం తెలుసని ప్రశ్నించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తమ బాధలను వివరిస్తామని తెలిపారు.