If it rains after afraid వర్షం వస్తే వణుకే
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:41 PM
If it rains after afraid శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయ భవనం స్వాతంత్య్రం నాటి కట్టడం కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఏమాత్రం వర్షం పడినా కారిపోతోంది. దీంతో కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఆ సమయంలో అవస్థలు పడుతున్నారు.
వర్షం వస్తే వణుకే
చిన్నపాటి వానకూ కారుతున్న ఎస్.కోట తహసీల్దార్ కార్యాలయ భవనాలు
అవస్థలు పడుతున్న సిబ్బంది
అక్కడికక్కడ ఊడుతున్న పైకప్పు శిథిలాలు
శృంగవరపుకోట, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి):
శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయ భవనం స్వాతంత్య్రం నాటి కట్టడం కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఏమాత్రం వర్షం పడినా కారిపోతోంది. దీంతో కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఆ సమయంలో అవస్థలు పడుతున్నారు. కొందరు వాన తగ్గేవరకు నిల్చొనే ఉంటారు. ఉరుము శబ్ధం వింటే భయపడుతున్నారు. ఇటీవల ఈ కార్యాలయం సమీపంలో పడిన పిడుగు శబ్ధానికి పైనున్న దూలం ఊడింది. దీంతో భారీ వర్షం కురిస్తే భవనం కూలుతుందన్న టెన్షన్‌లో ఉంటున్నారు. ఈభవనాల్లో కోర్టు నడిచేది. ఇక్కడే ఓ వైపు తాలుకా తహసీల్దార్ కార్యాలయం, మరో వైపు ఉప ఖజానా కార్యాలయం, ఇంకో వైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వీటికి అనుకుని సబ్ జైలు కార్యకలాపాలు నడిచేవి. కొంతకాలం కిందట మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టును విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్న పోలీస్‌స్టేషన్ సమీపానికి మార్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొన్ని మార్పులు, చేర్పులతో మరమ్మతులు చేశారు. తహసీల్దార్, ఉప ఖజానా కార్యాలయాల్లో మాత్రం ఏమార్పు లేదు.
- గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్ధార్ లక్ష్మారెడ్డి ఈ కార్యాలయ ఖాతాలో ములుగుతున్న సుమారు రూ.3లక్షల నిధులతో పాటు వివిధ వర్గాల నుంచి కొంతసొమ్మును సేకరించి మరమ్మతులు చేపట్టారు. రికార్డులు తడిచిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారు. నూతన భవన నిర్మాణం చేపట్టాలని ఉన్నతాధికారుల దృష్టిలోనూ పెట్టారు. ఆ తర్వాత రూ.90లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు ప్రచారం జరిగింది కానీ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు జరగలేదు. ఉప ఖజానాకు కేటాయించిన నిధులూ వెనక్కిమళ్లినట్లు తెలిసింది. పదేళ్ల కిందట చేపట్టిన మరమ్మతులతో ఇంత వరకు కార్యాలయం నడిచింది. ఇప్పుడు పూర్తిగా పాడైంది. తహసీల్దార్ గదితో పాటు జూనియర్, సీనియర్ అసిస్టెంట్, ఇతర సిబ్బంది ఉంటున్న గదులు శిథిలమయ్యాయి.