Share News

గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:49 PM

స్థానిక రైల్వేస్టేషన్‌లోని పీడబ్ల్యూ కార్యాలయ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు వీఆర్వో రాధాకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జోగారావు మంగళవా రం తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు

కొత్తవలస, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వేస్టేషన్‌లోని పీడబ్ల్యూ కార్యాలయ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు వీఆర్వో రాధాకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జోగారావు మంగళవా రం తెలిపారు. వీఆర్వో సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించామని చెప్పారు. మృతుడి వయస్సు సుమారు 25 ఏళ్లు ఉంటుందన్నారు. ఫ్యాంట్‌, టీషర్టు వేసుకుని ఉన్నాడని తెలిపారు. మృతుడు అనారోగ్య కారణం వల్ల గానీ, అతిగా మద్యం తాగడం వల్ల గానీ మృతిచెంది ఉండొచ్చని వీఆర్వో తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు కొత్తవలస పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించామని ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Sep 16 , 2025 | 11:49 PM