ఎళ్లవేళలా సేవ చేస్తా
ABN , Publish Date - May 17 , 2025 | 12:29 AM
‘మీ బిడ్డగా మీకు ఎళ్లవేళలా సేవ చేస్తాన’ని రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సంధ్యారాణి
సాలూరు/ మక్కువ, మే 16(ఆంధ్రజ్యోతి): ‘మీ బిడ్డగా మీకు ఎళ్లవేళలా సేవ చేస్తాన’ని రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మక్కువ మండలం పనసభధ్ర పంచాయతీ మూలవలస గ్రామంలో మంగళవారం నిర్వహించిన గంగమ్మతల్లి పండుగ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నా రు. ఆమెకు గిరిజనులు థింసా నృత్యాలతో స్వాగతం పలికారు. ముందుగా గంగమ్మతల్లి ఘటాలను ఆమె తలపై పెట్టుకుని గిరిజనులతో కలిసి తిరిగారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. మండలంలో ఉన్న 21 పంచాయతీల సమస్యలను దశలవారీగా నెరవేరుస్తానని తెలిపారు. నెల రోజుల్లో తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేస్తానన్నారు. అటవీ శాఖాధికారులతో మాట్లాడి కుంజుపాకతోపాటు అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. దుగ్గేరులో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించే పూచీ తనదని భరోసా ఇచ్చారు. టీడీపీ మండల అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయు డు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలో 200 కుటుంబాల చేరిక
పనసభద్ర పంచాయతీ పరిధిలో ఉన్న 14 గ్రామాల నుంచి 200 మంది మంత్రి సంధ్యా రాణి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకు న్నారు. వారికి ఆమె కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించా రు. ఈ కార్యక్రమంలో కోట శంకరనాయుడు, వీరభోజ వసంతరాయ లు, ఏఎంసీ వైస్ చైర్మన్ మెంతి సింహాచలం, డాక్టర్ మళ్లేశ్వరరావు, గౌరీశం కరరావు పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
సాలూరు: సాలూరు గ్రామదేవత అమ్మవారి పండుగ నిమిత్తం పట్టణంలో 20 ట్రాన్స్‌ఫార్మర్లను నూతనంగా అమర్చారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్లను మంత్రి సంధ్యారాణి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్యామలాంబ పండుగ నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో మాట్లాడి రూ.కోటి 60లక్షల నిధులు తెప్పించి పట్టణంలో 20 ట్రాన్స్‌ఫార్మర్లు, వందకు పైగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలి
గిరిజనులకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూడా లని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. సాలూరు మండలం లోని తోణాం గ్రామంలో నూతనంగా రూ.కోటి 82 లక్షలతో నిర్మించిన పీహెచ్‌సీ భవనాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సాలూరు మండలంలో మొట్టమొదటి సారిగా కంటైనర్ ఆసుపత్రి నిర్మించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. అనంతరం అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, అక్కేన తిరుపతిరావు, బలివాడ కిరణ్‌కుమార్, బలివాడ వెంకటేష్, బలివాడ రజనీతోపాటు తోణాం వైద్యులు ఏ.విజయ్‌కుమార్ పాల్గొన్నారు.