Share News

I will educate poor children. పేద పిల్లలను తీర్చిదిద్దుతాను

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:00 AM

I will educate poor children. ‘పేద పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవసరమైన బాటలు వేస్తాను. వారిని అన్ని విధాలా తీర్చిదిద్దుతాను’ అని కొత్త ఉపాధ్యాయుడు బొబ్బిలి పట్టణంలోని పూల్‌బాగ్‌కు చెందిన బంకురు రాకేష్‌ తెలిపారు.

I will educate poor children. పేద పిల్లలను తీర్చిదిద్దుతాను
గొల్లపల్లి మున్సిపల్‌హైస్కూలులో విధుల్లోచేరి తొలిసంతకం చేస్తున్న ఉపాధ్యాయుడు రాకేశ్‌

పేద పిల్లలను తీర్చిదిద్దుతాను

బొబ్బిలి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘పేద పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవసరమైన బాటలు వేస్తాను. వారిని అన్ని విధాలా తీర్చిదిద్దుతాను’ అని కొత్త ఉపాధ్యాయుడు బొబ్బిలి పట్టణంలోని పూల్‌బాగ్‌కు చెందిన బంకురు రాకేష్‌ తెలిపారు. గొల్లపల్లి వేణుగోపాల మునిసిపల్‌ హైస్కూలులో ఇంగ్లీషు ఉపాధ్యాయునిగా సోమవారం ఉద్యోగంలో చేరారు. ఇదే స్కూలులో తండ్రి రామకృష్ణ కూడా ఇంగ్లీషు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రాకేష్‌ మాట్లాడుతూ నాన్న పనిచేస్తున్న పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా నియామకం కావడం అరుదైన అవకాశంగా భావిస్తున్నానన్నారు. ఇద్దరం కలిసి పాఠశాలకు వెళ్తామన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 12:00 AM