భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:49 AM
భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానాను విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి ఎస్.దామోదరరావు తీర్పు చెప్పారని ఎస్పీ మాధవరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
బెలగాం/కొమరాడ, జూలై10 (ఆంధ్రజ్యోతి): భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానాను విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి ఎస్.దామోదరరావు తీర్పు చెప్పారని ఎస్పీ మాధవరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొమరాడ మండలం నయా గ్రామానికి చెందిన మండంగి గణపతి తన భార్య పులమమ్మను 2019న మే 26న రాత్రి 11 కత్తితో పుడిచి హత్య చేశా డు. దీనిపై అప్పట్లో కొమరాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి ఎస్‌ఐ ఎం.రాజేష్, పార్వతీపురం రూరల్ సీఐ జి.రాంబాబు దర్యాప్తు చేపట్టారు. కోర్టులో తగిన సాక్ష్యాధారాలు సమర్పించారు. గణప తి చేసిన నేరం రుజువు కావడంతో ఆయనకు శిక్ష విధిస్తూ న్యాయాధికా రి తీర్పు చెప్పారని ఎస్పీ వివరించారు.