Share News

నేటి నుంచి నిరాహార దీక్షలు

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:10 AM

గత 100రోజులుగా శాంతియుత పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని, సోమవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టను న్నామని జిందాల్‌ నిర్వాసితులు తెలిపారు.

నేటి నుంచి నిరాహార దీక్షలు

ఎస్‌.కోట రూరల్‌, సెప్టెంబరు 28(ఆంధ్ర జ్యోతి): గత 100రోజులుగా శాంతియుత పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని, సోమవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టను న్నామని జిందాల్‌ నిర్వాసితులు తెలిపారు. వంద రోజుల శాంతియుత పోరాటంలో పాల్గొ న్న వృద్ధులను ఆదివారం బొడ్డవరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురా జు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా జగన్‌లు సత్కరించారు. ఇందులో భాగంగా అమ్మపా లెం గ్రామానికి చెందిన 95ఏళ్ల గొండ గడ్డమ్మ ను సత్కరించారు. న్యాయం జరిగేవర కు ఉద్యమంలో ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - Sep 29 , 2025 | 12:10 AM