Share News

మొక్కలతోనే మానవ మనుగడ

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:02 AM

మొ క్కలతోనే మానవ మనుగడ సాధ్యమని డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు.

మొక్కలతోనే మానవ మనుగడ

  • డీసీసీబీ చైర్మన్‌ నాగార్జున

విజయనగరం రూరల్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మొ క్కలతోనే మానవ మనుగడ సాధ్యమని డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు. శుక్రవారం స్థానిక డీసీసీబీ కార్యాలయంలో ఇంటర్నేషనల్‌ కోఆపరేటివ్‌ సంవత్సరం సందర్భంగా ఆయన గ్రీనరీ వాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీడీఎం నాగార్జున, జిల్లా సహకార అభివృద్ధి అధికారి పి.రమేష్‌, సీఈవో ఉమామహేశ్వర రావు, సిబ్బంది పాల్గొన్నారు.

సహకార సంఘాల బలోపేతానికి కృషి

జిల్లాలోని సహకార సంఘాలు బలోపేతానికి కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు. శుక్రవారం స్థానిక డీసీసీబీ కార్యాలయంలో పర్సన్‌ ఇన్‌చా ర్జుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు, సంఘాలు ఆర్థికపరమైన అవకతవకలకు ఎటువంటి తావు లేకుండా భద్రత పరిమాణాలను మరింత పటిష్టంచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీవో పి.రమేష్‌, సీఈవో ఉమామహే శ్వరరావు, డీడీఎం నాగార్జున, అప్కాబ్‌ డీజీఎం అప్సర్‌ జహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:02 AM