Temples? మన ఆలయాల్లో భద్రత ఎంత?
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:28 PM
How Safe Are Our Temples? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో చోటుచేసుకున్న ఘటన జిల్లావాసులను కలవరపరుస్తోంది. భక్తులను కలచివేస్తోంది. ఇదే సమయంలో మన్యం జిల్లాలోని ఆలయాల్లో భద్రత ఎంత? అనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది.
‘మన్యం’లో పరిస్థితిపై చర్చ
అధికారులు మేలుకోవాలని విన్నపం
పార్వతీపురం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో చోటుచేసుకున్న ఘటన జిల్లావాసులను కలవరపరుస్తోంది. భక్తులను కలచివేస్తోంది. ఇదే సమయంలో మన్యం జిల్లాలోని ఆలయాల్లో భద్రత ఎంత? అనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ఆలయాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకముందే సంబంధి అధికారులు మేలుకుని పటిష్ఠ చర్యలు చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఎన్నో ప్రముఖ దేవాలయాలున్నాయి. అయితే అత్యధిక దేవాలయాల్లో సీసీ కెమెరాలు లేవు. దీంతో ఆలయాల్లో ఏర్పాట్లపై పర్యవేక్షణ కొరవడుతోంది. పురాతన దేవాలయాల వద్ద భక్తులకు రక్షణ కూడా ప్రశ్నార్థంగా మారింది. కార్తీకమాసంలోనే కాకుండా ఇతర సందర్భాలలోనూ ఆయా ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తుంటారు. ముఖ్యంగా కొమరాడ మండలం గుంప సోమేశ్వరాలయం, పాచిపెంట మండలం పారమ్మకొండ, పార్వతీపురం మండలం అడ్డాకుల కాశీవిశ్వేశ్వరాలయంతో పాటు అనేక దేవాలయాల్లో భక్తజనం బారులుదీరుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవాలయాల్లో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. క్యూలైన్లతో పాటు తాగునీరు, ఇతర వసతులు, భక్తులు సురక్షితంగా దైవదర్శనం చేసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉందా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిదిద్ది భక్తుల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. దేవదాయశాఖ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో దురదృష్టకర సంఘటనలు జరగకముందే సంబంఽధిత అధికారులు స్పందించాల్సి ఉందనే అభిప్రాయం జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది.