Share News

Drinking Water? మంచినీళ్లు కూడా ఇవ్వకపోతే ఎలా?

ABN , Publish Date - May 05 , 2025 | 11:42 PM

How Can You Refuse Even Drinking Water? ‘మున్సిపాల్టీలో ఉన్న ప్రజలకు తాగడానికి మంచినీళ్లు కూడా అధికారులు ఇవ్వకపోతే ఏం పని చేస్తున్నట్టు?మున్సిపాల్టీ అభివృద్ధికి రూ.రెండు కోట్ల నిధులు వచ్చి ఖాతాలో మగ్గుతున్నా అస్సలు పట్టడం లేద’ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  Drinking Water?   మంచినీళ్లు కూడా ఇవ్వకపోతే ఎలా?
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

  • అమ్మవారి పండుగను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి

  • రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు, మే5(ఆంధ్రజ్యోతి): ‘మున్సిపాల్టీలో ఉన్న ప్రజలకు తాగడానికి మంచినీళ్లు కూడా అధికారులు ఇవ్వకపోతే ఏం పని చేస్తున్నట్టు?మున్సిపాల్టీ అభివృద్ధికి రూ.రెండు కోట్ల నిధులు వచ్చి ఖాతాలో మగ్గుతున్నా అస్సలు పట్టడం లేద’ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించబోయే సాలూరు గ్రామదేవత శ్యామలాంబ పండుగ ఏర్పాట్లపై సోమవారం జేసీ శోభితతో కలసి స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ముందుగా పోలీస్‌ కంట్రోల్‌ రూం, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, డ్రోన్‌, బారికేడ్లు, పార్కింగ్‌ స్థలాలు కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని.. ఐదు డ్రోన్‌ కెమెరాలు.. 870 మంది పోలీసు సిబ్బంది అవసరం ఉందని డీఎస్పీ రాంబాబు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పండుగలో విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ శాఖకు సంబంధించి రూ.కోటి మంజూరు చేశామన్నారు.

రక్షిత పథకాలు ఏర్పాటు చేయండి

పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ...మార్చి 17న మున్సిపాల్టీ ఖాతాలో ప్రభుత్వం నిధులు జమచేసినా అధికారులు పట్టించుకోకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 29 వార్డులో రక్షిత నీటి పథకాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రతి వార్డులో రెండు రక్షిత నీటి పథకాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పండుగ సమయంలో రెండు పూటలా ప్రజలకు తాగునీరు అందించాలన్నారు. దేవదాయ శాఖ వద్ద ఎంత మొత్తం ఉందని ఆమె ప్రశ్నించారు. వారి వద్ద కేవలం రూ.95 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పటంతో అసహనం వ్యక్తం చేశారు. సుమారు 15 ఏళ్లుగా అమ్మవారి ఆదాయం కేవలం రూ.95 వేలేనా అని ప్రశ్నించారు. వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రత్యేక అధికారి డాక్టర్‌ శివకుమార్‌ను ఆదేశిం చారు. బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. తొమ్మిదేళ్లకోసారి నిర్వహించుకునే పండుగ 15 ఏళ్ల తరువాత జరుపు కోవడం దారుణమన్నారు. ఇకపై తొమ్మిదేళ్లకే జరుపుకోవాలని సూచిం చారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ డి.టి.వి.కృష్ణారావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్‌ అప్పలనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:42 PM