ఉద్యోగులను ఎలా నియమిస్తారు
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:03 AM
:కోర్టును గౌరవించండి...కాని అధికారులు ఇష్టానుసారంగా అడ్డదారిలో ఉద్యోగులను ఎలా నియమిస్తారని కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు.
పాలకొండ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):కోర్టును గౌరవించండి...కాని అధికారులు ఇష్టానుసారంగా అడ్డదారిలో ఉద్యోగులను ఎలా నియమిస్తారని కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. మంగళవారం నగర పంచాయతీ సర్వసభ్య సమావేశం చైర్మన్ ఆకుల మల్లీశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మూడేళ్ల కిందట ఏసీబీకి పట్టుబడిన కేసులో నిందితుడిగా సస్పెండ్ అయిన కె.బద్రిని మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను కమిషనర్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కౌన్సిలర్ వెలమల మన్మఽథరావు, కె.బాబీ, దుప్పాడ పాపినాయుడులు స్పందిస్తూ బద్రి స్థానంలో ఇటీవల అడ్డదారిలో ఒకరికి నియమించి మళ్లీ బద్రికి ఏ ఉద్యోగం ఇస్తారని నిలదీశారు. కనీసం కౌన్సిలర్లు తెలియకుండా అడ్డదారిలో నియమించారని తప్పుపట్టారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పదోన్నతి, జీతాలు పెంపునకు సంబంధించి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ప్రతిపాదించినా వాటిని ఎందుకు కొర్రీలు పెట్టారని ప్రశ్నించారు. దీనిపై సీనియర్ అసిస్టెంట్ హరి మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదోన్నతి పైల్ పద్ధతి ప్రకారం లేదన్నారు. అందుకే దానిని ప్రమోట్ చేయలేకపోతున్నామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ హనుమంతురావు, కౌన్సిలర్లు కిల్లారి మోహన్‌రావు, తూముల లక్ష్మణరావు, గంగునాయుడు, రమణ, టి.శంకరరావు పాల్గొన్నారు.