నిబంధనల మేరకే ఇళ్ల మంజూరు: జేఈ
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:09 AM
ప్రభుత్వ నిబంధనల మేరకే ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మండల గృహ నిర్మాణశాఖ జేఈ వంగపండు అఖిల్, వర్క్‌ఇన్‌స్పెక్టర్ ఎం.భాస్కరరావు తెలిపారు.
గరుగుబిల్లి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనల మేరకే ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మండల గృహ నిర్మాణశాఖ జేఈ వంగపండు అఖిల్, వర్క్‌ఇన్‌స్పెక్టర్ ఎం.భాస్కరరావు తెలిపారు. శనివారం గరుగుబిల్లిలోని పలు గ్రామాల్లో ఆవాస్ యోజన పథకంలో భాగంగా చక్కర్ పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో నవంబరు నెలాంతం వరకు గృహాల నమోదుకు సమయం ఉండే దని, ప్రస్తుతం ఆదివారం వరకు పరిశీలనకు సమయం పొడిగించారని తెలిపారు. గృహనిర్మాణానికి స్థలం ఉన్నా, లేకున్నా అర్హులైన వారికి జియో ట్యాగింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 31,310 మంది లబ్ధిదారులు గృహాలకోసం దరఖాస్తు చేసుకోగా, చక్కర్ పరిశీలన 14,107 మందికి నిర్వహించినట్లు చెప్పారు.