నిబంధనల మేరకే ఇళ్లు మంజూరు
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:17 AM
ప్రభుత్వ నిబం ధనల మేరకే ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లను మంజూరు చేయనున్నట్లు పార్వతీపురం గృహ నిర్మాణశాఖ ఈఈ జి.సోమేశ్వరరావు తెలిపారు.
గరుగుబిల్లి, నవంబరు 27 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ నిబం ధనల మేరకే ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లను మంజూరు చేయనున్నట్లు పార్వతీపురం గృహ నిర్మాణశాఖ ఈఈ జి.సోమేశ్వరరావు తెలిపారు. గురువారం గరుగుబిల్లిలో ఆవాస్ యోజన పథకం ఇళ్లకోసం సర్వే నిర్వహ ణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 25 పంచాయతీల నుంచి 1,784 మంది దరఖాస్తు చేసుకోగా, 715 పరిశీలించినట్లు చెప్పారు. పంచాయతీల పరిధిలో సర్వే నిర్వహణకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు. నిర్మాణానికి స్థలం లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చని, స్థలం ఉంటే సంబంధిత లబ్ధిదారునితో జియోట్యాగింగ్ నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 29లోగా సర్వే పూర్తికావాలని కోరారు. ఆయన వెంట ఎంపీడీవో జి.పైడితల్లి, ఏఈ వి.అఖిల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ ఎం.భాస్కరరావు ఉన్నారు.