అర్హులకు ఇళ్ల పట్టాలు: సబ్ కలెక్టర్
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:08 AM
:అర్హులకు ఇళ్ల స్థల పట్టాలు అందేలా చూడాలని పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ కోరారు. విక్రంపురం, వీరఘట్టంలోని గెంబలివీధిలో ఇళ్ల స్థల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడారు.
వీరఘట్టం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి):అర్హులకు ఇళ్ల స్థల పట్టాలు అందేలా చూడాలని పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ కోరారు. విక్రంపురం, వీరఘట్టంలోని గెంబలివీధిలో ఇళ్ల స్థల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడారు. 270 ఇళ్లపట్టాల కోసం దరఖాస్తులు వచ్చాయని, 80 దరఖాస్తులు పరిశీలన పూర్తయిందని తహసీల్దార్ సాయి కామేశ్వరరావు తెలిపారు. అనంతరం గతంలో పట్టాలిచ్చిన వీరఘట్టం సమీపంలో అచ్చెపువలస లేఅవుట్ పరిశీలించారు.