ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలి: కమిషనర్
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:33 PM
పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులు సకాలంలో చెల్లించేలా ముందుకు రావాలని మునిసిపల్ కమిషనర్ ఎ.రామ చంద్రరావు కోరారు. బుధవారం రాజాంలోని పలు వార్డుల్లో ఇంటి పన్నులు, కొళాయి బిల్లులు వసూలును పరిశీలించారు. జేజే హోటల్ యజమాని మోహన్ రావు దొర నుంచి రెండు లక్షల 57 వేల 060 రూపాయలు వసూలుచేశారు. ఇంటి, నీటి పన్నుల వసూలులో భాగంగా పట్టణంలో అధిక మొత్తంలో బకాయిలు ఉన్నవారిని కమిషనర్ స్వయంగా కలిసి వసూలుచేయించారు.
రాజాం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులు సకాలంలో చెల్లించేలా ముందుకు రావాలని మునిసిపల్ కమిషనర్ ఎ.రామ చంద్రరావు కోరారు. బుధవారం రాజాంలోని పలు వార్డుల్లో ఇంటి పన్నులు, కొళాయి బిల్లులు వసూలును పరిశీలించారు. జేజే హోటల్ యజమాని మోహన్ రావు దొర నుంచి రెండు లక్షల 57 వేల 060 రూపాయలు వసూలుచేశారు. ఇంటి, నీటి పన్నుల వసూలులో భాగంగా పట్టణంలో అధిక మొత్తంలో బకాయిలు ఉన్నవారిని కమిషనర్ స్వయంగా కలిసి వసూలుచేయించారు.
బడ్డీలు ఏర్పాటుచేస్తే చర్యలు
కోర్టుకు వెళ్లే రహదారిలో ఎవరైనా బడ్డీలు ఏర్పాటుచేసినా, కోర్టుకు వెళ్లడానికి ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవని మునిసిపల్ కమిషనర్ ఎ. రామచంద్రరావు హెచ్చరించారు. బుధవారం రాజాంలోని కోర్టుకు వెళ్లే రహదారిలో ఉన్నబడ్డీలను పారిశుధ్య కార్మికులతో తొలగించారు. కోర్టుకు వెళ్లే మార్గంలో నివాసముంటున్న వారు కర్రలు పాతి చీరలు కట్టి స్నానాలు గదులు ఏర్పాటు చేసుకోవడంతో వాటిని కూడా తొలగించారు. అనంతరం పలు వార్డుల్లో పారిఽఽశుధ్య పనులను పరిశీలించారు.