అర్హులందరికీ ఇళ్ల స్థలాలు: సబ్ కలెక్టర్
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:29 AM
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందని పార్వతీపురం సబ్‌కలెక్టర్ వైశాలి తెలిపారు.శనివారం శంబరలో ఇళ్లస్థలాలకోసం దరఖాస్తుచేసుకున్నవారితో మా ట్లాడారు.
మక్కువ రూరల్,సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందని పార్వతీపురం సబ్‌కలెక్టర్ వైశాలి తెలిపారు.శనివారం శంబరలో ఇళ్లస్థలాలకోసం దరఖాస్తుచేసుకున్నవారితో మా ట్లాడారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ఇల్లులేని నిరుపేదలకు ప్రభుత్వం మూడు సెంట్ల స్థలం మంజూరు చేస్తుందని తెలిపారు.శంబరలో ఎంతమంది దరఖాస్తుచేసుకున్నారో తెలుసుకొని వారి వివరాలు అందజేయాలని మక్కువ తహసీల్దార్ భరత్‌కుమార్‌ను ఆదేశించారు. శంబరలో ఖాళీగా ఎక్కడ ఎంత స్థలం ఉందో సర్వేచేసి నివేదిక ఇవ్వాలని ఆమె అధికారులను కోరారు.