అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:41 PM
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేయాలని, దీని కోసం వారి పేర్లు నమోదుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులు ఆదేశిం చారు.ఇళ్ల స్థలాలకోసం పేర్లు నమోదు చేసుకోవడానికి ఈనెల 14 వరకూ ప్రభుత్వం గడువు ఇచ్చిందని,ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేసి నమో దు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేయాలని, దీని కోసం వారి పేర్లు నమోదుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులు ఆదేశిం చారు.ఇళ్ల స్థలాలకోసం పేర్లు నమోదు చేసుకోవడానికి ఈనెల 14 వరకూ ప్రభుత్వం గడువు ఇచ్చిందని,ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేసి నమో దు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం విజయనగ రం నుంచి ఆయా శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్లస్థలాలు మంజూరుకు గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించాలన్నా రు. ఆయాగ్రామాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలాలు, ఇంకా ఎంత కావాలి, తదితర వివరాలను సిద్ధం చేయాలని సూచించారు. ముటేషన్లు, ఇతర రెవెన్యూ సంబందిత దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్క రించాలని కోరారు. రైస్ కార్డులు పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయా లని జేసీ సేతు మాధవన్‌ను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, గోనె సంచులు, జీపీఎస్‌తో కూడిన వాహ నాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. రెండు రోజుల్లో బ్యాంకు గ్యారెంటీలు కూడా పూర్తవుతాయని తెలిపారు.బీజీలు రానిచోట్ల మిల్లర్లతో మాట్లాడాలని సూచించారు. సమావేశంలో12 రెవెన్యూ, అనుబంధ శాఖల అంశాలపై చర్చించా రు.హౌసింగ్ ఫర్‌ఆల్,ఖాళీస్థలాలు రెగ్యు లరైజేషన్ స్కీమ్‌తోపాటు, భూ బదిలీ, 22ఏ పైళ్లు, వెబ్‌ల్యాండ్, ముటేషన్ల పురోగతి తదితరఅంశాలపై చర్చించారు. సమావే శంలో ఇన్‌చార్జి డీఆర్వో మురళి, ఆర్డీవోలు పాల్గొన్నారు.