Home Guards పోలీస్ శాఖలో హోంగార్డుల పాత్ర కీలకం
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:07 PM
Home Guards: A Crucial Force in Police Operations పోలీస్ శాఖలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ మల్టీ ఫంక్షన్ హాల్ ఆవరణలో శనివారం హోంగార్డుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాధవరెడ్డి హోం గార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
బెలగాం, డిసెంబరు6(ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ మల్టీ ఫంక్షన్ హాల్ ఆవరణలో శనివారం హోంగార్డుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాధవరెడ్డి హోం గార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ .. కేసుల దర్యాప్తు, నిందితులను పట్టుకోవడంలో పోలీస్ అధికారులకు హోంగార్డులు ఎంతగానో సహకరిస్తారని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా విఽధులు నిర్వహిస్తూ.. పోలీస్ శాఖకు వెన్నెముకలా ఉంటారని కొనియాడారు. అనంతరం హోంగార్డులకు చిహ్నమైన పావురాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు వెంకటేశ్వరరావు, మనీషా వంగలరెడ్డి, డీఎస్పీ థామస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.