Holidays బడులకు సెలవులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:31 PM
Holidays for Schools పాఠశాలలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ రామరాజు శనివారం ఆదేశాలు జారీ చేశారు. 21వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే బడులకు సెలవులు ఇచ్చినట్టయ్యింది. విద్యా క్యాలండర్ ప్రకారం ఈనెల 24 నుంచి దసరా సెలవులు ఇవ్వాల్సి ఉంది. కానీ 22 నుంచే శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నందున ఆ రోజు నుంచే సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు.
బస్సులు కిటకిట
సాలూరు రూరల్/ పాచిపెంట/ సీతంపేట రూరల్/ గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ రామరాజు శనివారం ఆదేశాలు జారీ చేశారు. 21వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే బడులకు సెలవులు ఇచ్చినట్టయ్యింది. విద్యా క్యాలండర్ ప్రకారం ఈనెల 24 నుంచి దసరా సెలవులు ఇవ్వాల్సి ఉంది. కానీ 22 నుంచే శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నందున ఆ రోజు నుంచే సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 1,758 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ సెలవులు పాటించాల్సి ఉంది. వచ్చే నెల 3న బడులు పునః ప్రారంభం కానున్నాయి. మరోవైపు బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కేబీజీబీలు, మోడల్ స్కూల్స్, వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు శనివారం సాయంత్రం నుంచే తమ స్వగ్రామాలకు పయనమయ్యారు. తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలలకు చేరుకోవడంతో విద్యార్థులు ఆనందంతో పెట్టెలు, పుస్తకాలు సర్దుకుని ఇంటి బాట పట్టారు. గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేట గ్రామంలోని రహదారులు మార్కెట్ ప్రాంతం కళకళలాడాయి. బస్సులు, వివిధ ప్రైవేట్ వాహనాలు రద్దీగా కనిపించాయి.
ప్రమాదకర ప్రయాణం
భామిని: పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకులం, కేజీబీవీ, ఆదర్శ పాఠశాల విద్యార్థులు శనివారం సాయంత్రం ఒక్కసారిగా భామిని బస్టాండ్‌కు చేరుకున్నారు. అయితే బస్సులు రాకపోవడంతో గంటన్నరపాటు అక్కడ నిరీక్షించారు. బత్తిలి, కొరమ నుంచి మండల కేంద్రానికి వచ్చిన విద్యార్థులకు సైతం అవస్థలు తప్పలేదు. ఆ తర్వాత ఓ బస్సు రాగానే వారంతా ఎగబడ్డారు. సీట్ల కోసం పోటీబడ్డారు. ఫుట్‌పాత్‌పై బ్యాగ్‌లతో నిల్చొని ప్రమాదకరంగా ప్రయాణించారు. కొంతమంది విద్యార్థినులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.