Promotions సజావుగా హెచ్‌ఎంల పదోన్నతుల ప్రక్రియ
ABN , Publish Date - May 29 , 2025 | 11:28 PM
HM Promotions Process Progressing Smoothly ఉమ్మడి జిల్లా పాఠ శాల సహాయకుల నుంచి గ్రేడ్ టు ప్రధానోపాధ్యాయుల పదోన్నతి కౌన్సిలింగ్ గురువారం విజయనగరం బాలికోన్నత పాఠశాలలో సజావుగా జరిగింది. వారంతా ఉదయం 8 గంటలకు కౌన్సిలింగ్ హాల్‌కు చేరు కున్నారు. సాంకేతిక కారణాల వల్ల సాయంత్రం ప్రక్రియ ఆరంభమైంది.
సాలూరు రూరల్, మే 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా పాఠ శాల సహాయకుల నుంచి గ్రేడ్ టు ప్రధానోపాధ్యాయుల పదోన్నతి కౌన్సిలింగ్ గురువారం విజయనగరం బాలికోన్నత పాఠశాలలో సజావుగా జరిగింది. వారంతా ఉదయం 8 గంటలకు కౌన్సిలింగ్ హాల్‌కు చేరు కున్నారు. సాంకేతిక కారణాల వల్ల సాయంత్రం ప్రక్రియ ఆరంభమైంది. రాత్రి ఏడు గంటల వరకు కౌన్సిలింగ్ జరిగింది. విజయ నగరం డీఈవో మాణిక్య నాయుడు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో చినమేరంగి, బీజే పురం, చినకుదమ, గరుగుబిల్లి, ఎన్.ములగ, శంబర, కోన, మక్కువ, బూర్జ, అజ్జాడ, నారాయణపురం, అరసాడ, గళావిల్లి, ఉద్దవోలు, వెలగవలస, బిళ్లలవలస, గర్భాం, కె.కృష్ణాపురం, ఆర్సీ పురం, మరడాం, దత్తి, దత్తిరాజేరు, పీఎం పల్లి, పోరాం, ఆండ్ర, జయితి, పెదబంటు పల్లి, వేదుళ్లవలస, బొండపల్లి, కాపుశంభాం, చీపురుపల్లి, కర్లాం, పేరిపి, పెదనడిపల్లి, పాలవలస , గుంపాం, గోవిందపురం, చింతపల్లి, కోనాడ, ఎన్‌కేఆర్ పురం (ఏజీఆర్), కొట్యాడ, చందూలూరు, కంటకాపల్లి, బుదరాయవలస జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న హెచ్‌ఎంల పోస్టులకు గాను పాఠశాల సహాయకులకు పదోన్నతులు ఇచ్చారు.