His singing is popular ఆయన గానం.. జనరంజకం
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:14 AM
His singing is popular ఆయనో జానపద కళాకారుడు. పల్లె పదాలను అద్భుతంగా కూర్చి తన గొంతుతో మనోరంజకంగా పాడేవారు. దశాబ్దకాలం ప్యాసింజర్ రైలులో ప్రయాణికులను ఉర్రూతలూగించారు. రైళ్లలో యాచన చేస్తుండగా సాగిన ఆయన పాటల ప్రస్థానం సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. అంతే దశ తిరిగింది. సినీ నేపథ్య గాయకుడిని చేసింది. సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన బోనెల అసిరయ్య ప్రస్థానమిది.
ఆయన గానం.. జనరంజకం
సినీ నేపథ్య గాయకుడిగా జానపద కళాకారుడు అసిరయ్య
వెనుక సోషల్ మీడియా సహకారం
రాజాం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
ఆయనో జానపద కళాకారుడు. పల్లె పదాలను అద్భుతంగా కూర్చి తన గొంతుతో మనోరంజకంగా పాడేవారు. దశాబ్దకాలం ప్యాసింజర్ రైలులో ప్రయాణికులను ఉర్రూతలూగించారు. రైళ్లలో యాచన చేస్తుండగా సాగిన ఆయన పాటల ప్రస్థానం సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. అంతే దశ తిరిగింది. సినీ నేపథ్య గాయకుడిని చేసింది. సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన బోనెల అసిరయ్య ప్రస్థానమిది.
ఉత్తరాంధ్రలో జముకు వాయిద్యానికి విశేష ఆదరణ ఉండేది. జముకుతో జానపదాలు పాడుతూ జనాన్ని అప్పట్లో కళాకారులు రంజింపజేసేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ మాధ్యమాల ప్రభావంతో ఆ కళకు ఆదరణ తగ్గింది. కానీ అదే కళను నమ్ముకున్నారు సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన బోనెల అసిరయ్య. ఎటువంటి చదువు లేకపోయినా వాడుక భాషలో ఉండే పదాలను జతకూర్చుతూ జముకు కళను నేర్చుకున్నారు. పగలంతా వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ రాత్రిపూట జముకు పరికరంతో జానపదాలతో పల్లె ప్రజలకు వినోదం పంచేవారు. ఈ కళకు ఆదరణ తగ్గడంతో ప్రతిరోజూ పొందూరు నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ రైళ్లు.. విశాఖ వైపు వెళ్లే రైళ్లలో జముకుతో జానపదాలు పాడుతూ జీవించేవారు. అసిరయ్య పాటలకు వీడియోలు తీసిన కొందరు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలా ఆ వీడియోలు పేరుమోసిన రికార్డింగు సంస్థల దృష్టికి వెళ్లాయి. ఈ క్రమంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, నేపథ్య గాయకుడు రఘు కుంచే చెవిలో పడ్డాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దర్శకుడు కద్దాల కిరణ్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పలాస 1978’ సినిమాలో పాడే అవకాశం కల్పించారు. అసిరయ్య పాడుకునే నాదీ నక్లీస్ గొలుసు మంచి ప్రేక్షకాదరణ పొందింది. సోషల్ మీడియా విశేష ఆదరణ పొందింది. ఒక సాధారణ కళాకారుడిగా ఉన్న అసిరయ్యను సోషల్‌మీడియా గుర్తింపు కలిగిన వ్యక్తిగా మార్చేసింది.