Share News

నవధాన్యాల సాగుతో అధిక దిగుబడి

ABN , Publish Date - May 22 , 2025 | 12:13 AM

నవధాన్యాలు సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. బుధవారం కురుపాం రైతుసేవా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేశారు.

నవధాన్యాల సాగుతో అధిక దిగుబడి
కురుపాం:నవధాన్యాల కిట్‌ అందజేస్తున్న జగదీశ్వరి :

కురుపాం, మే21(ఆంధ్రజ్యోతి): నవధాన్యాలు సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. బుధవారం కురుపాం రైతుసేవా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ భూములు సారవంతంగా ఉండేందుకు 20 నుంచి 30 రకాల విత్తనాల మిశ్రమం గల నవధాన్యాలను ఎకరానికి 15 నుంచి 25 కేజీలను వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి, టీడీపీ మండల కన్వీనర్‌ కేవీ కొండయ్య పాల్గొన్నారు.

బాధితులకు అండగా ఉంటాం

గరుగుబిల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి తెలిపారు. బుధవారం మండలం లోని చినగుడబలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో గృహాలు కోల్పోయిన ముడిల కళావతి, సరస్వతి, భాస్కరరావుకు రూ.15 వేలతోపాటు నిత్యావసర సామగ్రిని అం దించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పి.బాల,టీడీపీ ప్రతినిధులు ఎం.పురుషోత్తంనాయుడు,తవిటినాయుడు, అంబటి రాంబాబు, ద్వారపురెడ్డి సత్యనారాయణ, ముదిలిబాబు విజయవాంకుశం, వెంపటాపు భారతి, సర్పంచ్‌ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:13 AM