Share News

‘Mauritius ‘మారిషస్‌’తో అధిక దిగుబడులు

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:22 PM

High Yields with ‘Mauritius మారిషస్‌ రకం పైనాపిల్‌ సాగుతో అధికదిగుబడులు సాధించవొచ్చునని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు. శుక్రవారం బిల్లగూడ, ఇప్పగూడ గ్రామాల్లో పైనాపిల్‌ పంటను పరిశీలించారు. సాగు విధానాన్ని గిరిజన రైతులను అడిగి తెలుసుకున్నారు.

 ‘Mauritius ‘మారిషస్‌’తో అధిక దిగుబడులు
మారిషస్‌ పైనాపిల్‌ పంటను పరిశీలిస్తున్న పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌

సీతంపేట రూరల్‌, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): మారిషస్‌ రకం పైనాపిల్‌ సాగుతో అధికదిగుబడులు సాధించవొచ్చునని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు. శుక్రవారం బిల్లగూడ, ఇప్పగూడ గ్రామాల్లో పైనాపిల్‌ పంటను పరిశీలించారు. సాగు విధానాన్ని గిరిజన రైతులను అడిగి తెలుసుకున్నారు. జీడి, మామిడి పునరుద్ధరణ పథకంలో భాగంగా అధిక దిగుబడులు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు ఇన్‌చార్జి పీవో తెలిపారు. వచ్చే ఏడాది సీతంపేట, భామిని మండలాల్లోని ఈతమానుగూడ, కీసరజోడు, బిల్లగూడ, పాలిష్‌కోట, నల్లరాయిగూడ, మనుమకొండ గ్రామాల్లో మామిడిని ప్రయోగాత్మకంగా సాగుచేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల ప్రతి చెట్టుకూ రెండు నుంచి మూడు కేజీల దిగుబడి పెరుగుతుందని అన్నారు. అనంతరం తురాయిపువలస ఉద్యానవన నర్సరీని పరిశీలించారు. అంటుకట్టే విధానాలను అడిగి తెలుసుకున్నారు.

నాణ్యత లోపిస్తే చర్యలు

ఐటీడీఏ పరిధిలోని గురుకులాలకు సరఫరా చేసే కూరగాయలు, అరటిపండ్లు, చికెన్‌ సరఫరాలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ హెచ్చ రించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. టెండర్‌దారులు నిబంధనలు పాటించాలన్నారు. సకాలంలో ఆహారపదార్థాలను సరఫరా చేయాలని సూచించారు. ఏపీవో చిన్నబాబు, డీడీ అన్నదొర, జీసీసీ బీఎం కృష్ణ, ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవో సూర్యనారాయణ, గురుకుల కళాశాల, పాఠశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:22 PM