నానో యూరియాతో అధిక దిగుబడి
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:55 PM
వరి పంటకు రెండో దఫాగా యూరియా చల్లకుండా నానో యూరియా ఎకరానికి 500 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి వీటీరామారావు తెలిపారు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పారు. బుధవారం డెంకాడలో పొలంపిలుస్తోంది, యూరియా మీచెంతకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండుమూడు రోజుల్లో కొన్ని రైతుసేవా కేంద్రాలకు యూరియా వస్తుం దని తెలిపారు. కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ చంద్రశేఖరరావు, సహాయ వ్యవ సాయసంచాలకుడు ఎ.నాగభూషణరావు, ఏవో టి.సంగీత, వ్యవసాయ విస్తరణ అధికారి బి.రామకోటి, పాణిరాజు, వీఏఏలు అపర్ణ, లిను పాల్గొన్నారు.
డెంకాడ, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): వరి పంటకు రెండో దఫాగా యూరియా చల్లకుండా నానో యూరియా ఎకరానికి 500 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి వీటీరామారావు తెలిపారు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పారు. బుధవారం డెంకాడలో పొలంపిలుస్తోంది, యూరియా మీచెంతకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండుమూడు రోజుల్లో కొన్ని రైతుసేవా కేంద్రాలకు యూరియా వస్తుం దని తెలిపారు. కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ చంద్రశేఖరరావు, సహాయ వ్యవ సాయసంచాలకుడు ఎ.నాగభూషణరావు, ఏవో టి.సంగీత, వ్యవసాయ విస్తరణ అధికారి బి.రామకోటి, పాణిరాజు, వీఏఏలు అపర్ణ, లిను పాల్గొన్నారు.
అవసరమైన మేరకే యూరియా వినియోగించాలి
కొత్తవలస, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని ఏవో కేవీ రాంప్రసాద్ తెలిపారు. బుధవారం కొత్తవలస రైతు సేవాకేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు అవసరం మేరకే యూరియా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది గణేస్, కుమారి, రవి ప్రకాష్ పాల్గొన్నారు.
ఫ గజపతినగరం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి):నానో యూరియా ప్రతి ఒక్కరూ వినియోగించాలని ఏవో కిరణ్‌కుమార్ తెలిపారు.బుధవారం మండలంలోని లోగిస, మరుపల్లిల్లో నానోయూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు.
జీఎన్‌పురంలో ‘పొలం పిలుస్తుంది’
సంతకవిటి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి):మండలంలో మంతిన, జీఎన్‌పురంలో బుధ వారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో సీబీ యశ్వంత్‌రావు ఆధ్వర్యంలో ని ర్వహించారు.ఈసందర్భంగా వరి పొలాలను పరిశీలించి సంరక్షణపై రైతులకు అవగాహ న కల్పించారు. కార్యక్రమంలో వీఏఏ పావని, రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.
యూరియా పంపిణీలో విఫలం
నెల్లిమర్ల,సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి):రైతులకు యూరియా సకాలంలో అందించడం లో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ మండల కార్యదర్శి ముయ్యద పాపారావు ఆరోపించారు.బుధవారం నెల్లిమర్లలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నా అరకొరగా సరఫరా చేయడం వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.